తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో బ్లాక్​ ఫంగస్​ పంజా- ఇద్దరు మృతి

మహారాష్ట్ర ఠాణే జిల్లాలో బ్లాంక్​ ఫంగస్​ పంజా విసురుతోంది. ఈ శిలీంధ్ర వ్యాధి కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ఆసుపత్రుల్లో చేరారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Black fungus
బ్లాక్​ ఫంగస్

By

Published : May 12, 2021, 11:14 AM IST

కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత సమయంలో బ్లాక్​ ఫంగస్​ (మ్యూకోర్మైకోసిస్‌ ) పంజా విసురుతోంది. ఈ అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా మహారాష్ట్ర ఠాణే జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చేరారు.

జిల్లాలోని మహరల్​ గ్రామానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తితో పాటు దొంబివిల్​ పట్టణానికి చెందిన వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇరువురు కల్యాణ్​ దొంబివిల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని వేరువేరు కొవిడ్​-19 కేర్​ సెంటర్లలో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వ వైద్యులు డాక్టర్​ అశ్విని పాటిల్​ తెలిపారు. బ్లాంక్​ ఫంగస్​ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆరుగురిలో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.

డయాబెటీస్​తో బాధపడుతున్న వారిలోనే ఈ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయని, కొవిడ్​ రోగులు ఆందోళనకు గురికావాల్సిన పని లేదని అధికారులు సూచిస్తున్నారు. అలాంటి రోగులు తమ రక్తంలోని సుగర్​ స్థాయిులను పరిమితిలో ఉంచుకోవాలన్నారు. కొవిడ్​-19 రోగుల్లో ఫంగస్​ లక్షణాలు కనిపిస్తే.. ఎక్కువ మొత్తంలో స్టెరాయిడ్స్​ తీసుకోవద్దని సూచించారు.

రాష్ట్రంలో 2వేల మంది బాధితులు

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2వేలకుపైగా బ్లాక్​ ఫంగస్​ బాధితులను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్​ టోపే తెలిపారు. కరోనా కేసులు పెరిగే కొద్ది ఫంగస్​ బాధితులు పెరిగే అవకాశం ఉందన్నారు. వైద్య కళాశాల్లోని ఆసుపత్రుల్లో వారికి చికిత్స ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:గుజరాత్​లో ఫంగస్​ ఇన్ఫెక్షన్​- 9 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details