తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ వస్తే చొరబాట్లు, అవినీతి' - pm modi on congress

అసోంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాట్లు, అవినీతి పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఓటర్లను హెచ్చరించారు. అసోం ప్రత్యేకతను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఏఐయూడీఎఫ్​తో కాంగ్రెస్​ చేతులు కలిపిందని విమర్శించారు.

modi
'కాంగ్రెస్​ వస్తే చొరబాట్లు, అవినీతి'

By

Published : Mar 24, 2021, 5:00 PM IST

Updated : Mar 24, 2021, 5:41 PM IST

కాంగ్రెస్​-ఏఐయూడీఎఫ్​ కూటమితో అప్రమత్తంగా ఉండాలని అసోం ప్రజలను హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్​ పేర్కొన్నట్టుగా అది మహా కూటమి కాదని.. అదంతా పెద్ద అబద్ధం అని ఎద్దేవా చేశారు. లఖ్మిపూర్​ జిల్లాలోని బిహూపుర్​లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఓట్ల కోసం కాంగ్రెస్​ ఎదైనా చేస్తుంది, ఎవరినైనా మోసం చేస్తుంది. సరైన నేతలు లేని కాంగ్రెస్​కు నైతికత కూడా లేదు. అసోంలో లెఫ్ట్​ పార్టీలతో చేతులు కలిపిన ఆ పార్టీ.. కేరళలో వారిని విమర్శిస్తోంది. ప్రస్తుతం అసోంలో అభివృద్ధి కనిపిస్తోంది. చొరబాటుదార్లకు అవకాశమే లేదు. అసోం ప్రత్యేకతను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఏఐయూడీఎఫ్​తో ఆ పార్టీ చేతులు కలిపింది. చోరబాట్లను ప్రోత్సహించే వారి సాయాన్ని కాంగ్రెస్ కోరుతోంది. అటువంటి కూటమి చొరబాట్లు, అవినీతికి దారితీస్తుంది. మీకు అసోం సంప్రదాయాలను నాశనం చేసుకోవాలని ఉందా?"

-నరేంద్ర మోదీ, ప్రధాని

దుష్ప్ర చారం చేస్తోంది..

కాంగ్రెస్​ హయాంలో టీ కార్మికుల వేతనాలను కనీసం రూ.100కు కూడా పెంచలేదని, ఆ పార్టీనే ఇప్పుడు దుష్ప్రచారాలు చేస్తోందని మోదీ విమర్శించారు. ఎన్​డీఏ హయాంలో వారి వేతనాలను ఐదేళ్లలో రెండింతలు చేశామని చెప్పారు. అధికారం చేపట్టాక టీ కార్మికుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :'ఔట్​సైడర్స్​'పై మోదీ, దీదీ మాటల యుద్ధం

Last Updated : Mar 24, 2021, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details