తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పులుల గణనకు వెళ్లి.. పులి దాడిలోనే మహిళా ఉద్యోగి మృతి - పులి దాడిలో వ్యక్తి మృతి

పులుల గణన (tiger population in india) కోసం అడవిలోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసి చంపేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో (Recent tiger attack in Maharashtra) ఈ ఘటన జరిగింది.

forest guard killed
పులి దాడిలో వ్యక్తి మృతి

By

Published : Nov 20, 2021, 3:03 PM IST

Updated : Nov 20, 2021, 3:37 PM IST

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ఘోరం జరిగింది. పులుల గణన (tiger population in india) కోసం అడవిలోకి వెళ్లిన ఓ మహిళా ఉద్యోగిపై పులి దాడి చేసి చంపేసింది. తడోబా అభయారణ్యంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

తడోబా అభయారణ్యంలో (Recent tiger attack in Maharashtra) గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు పులుల గణన చేపట్టారు. ఈ పనుల నిమిత్తం సోమవారం కొంతమంది అటవీశాఖ సిబ్బంది, అటవీ కూలీలు కోలారా గేట్‌ వద్ద ఉన్న 97వ కోర్‌ జోన్‌కు వెళ్లారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ పులి వారిపై దాడి చేసింది. అటవీశాఖ మహిళా ఉద్యోగి స్వాతి ధోమనే(43)పై దాడి చేసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లింది. అటవీ శాఖ కూలీలు వెంబడించినప్పటికీ పులి ఆమెను వదిలిపెట్టలేదు. సమాచారమందుకున్న తడోబా మేనేజ్‌మెంట్‌ అధికారి, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అభయారణ్యంలోని దట్టమైన పొదల ప్రాంతంలో స్వాతి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి:యూనివర్సిటీలోకి భారీ కొండచిలువ.. విద్యార్థులు హడల్​

Last Updated : Nov 20, 2021, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details