మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో లాక్డౌన్ మార్గదర్శకాలను సడలించింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెలలో హోటళ్లు, బార్లు తెరవడానికి అనుమతిచ్చిన ప్రభుత్వం.. గురువారం (నవంబరు 5) నుంచి సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్‌లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలను తెరిచేందుకు సమ్మతి తెలిపింది.
50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆహార పదార్థాలకు లోపలికి అనుమతిలేదు.
ఈత కొలనుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకే అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది మహా ప్రభుత్వం. యోగా సంస్థలు, బ్యాడ్మింటన్ హాల్స్, టెన్నిస్, క్వాష్ కోర్టు, ఇండోర్ షూటింగ్ రేంజ్ వంటి ఇండోర్ క్రీడలు నిర్వహించుకోవచ్చు.