'మహా'లో కరోనా రికార్డు- ఒక్కరోజే 60 వేల కేసులు - Maharashtra coronavirus
మహారాష్ట్రలో రికార్డు సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్తగా 60 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 322 మంది చనిపోయారు. మరో 30 వేల మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దిల్లీ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
మహా కరోనా రికార్డు- ఒక్కోరోజే 60 వేల కేసులు
By
Published : Apr 7, 2021, 11:03 PM IST
మహారాష్ట్రలో కరోనా కేసులు బుధవారం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 59,907 కేసులు బయటపడ్డాయి. మరో 322 మందికి కొవిడ్‌కు బలయ్యారు. తాజాగా 30,296 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
కన్నడ నాట 7 వేల కేసులు
కర్ణాటకలో కరోనా పంజా విసురుతోంది. ఒక్కరోజే 6,976 కేసులు నమోదయ్యాయి. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షల 33 వేలు దాటింది.
యూపీలో ఉగ్రరూపం
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 6,023 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 40 మంది కరోనాకు బలయ్యారు.
దిల్లీలో తాజాగా 5,506 మందికి వైరస్ సోకగా.. 20 మంది మరణించారు.