'మహా'లో మరో 56 వేల కరోనా కేసులు - Delhi Coronavirus cases
కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. మహారాష్ట్రలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు, కేరళ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొవిడ్ పంజా విసురుతోంది.
కరోనావైరస్
By
Published : Apr 8, 2021, 10:56 PM IST
మహారాష్ట్రలో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతన్నాయి. తాజాగా 56,286 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 32 లక్షల 29 వేలు దాటింది. మరో 376 మంది కరోనాకు బలయ్యారు. 36,130 మంది మహమ్మారిని జయించారు.
7 లక్షలకు చేరువలో..
దిల్లీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒక్కరోజే 7,437 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. మరో 24 మంది మృతి చెందారు.
యూపీలో విజృంభణ
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 8,490 కేసులు వెలుగుచూశాయి. మరో 39 మంది చనిపోయారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో కొవిడ్ పంజా విసురుతోంది. కొత్తగా 6,570 మంది వైరస్ బారిన పడగా.. 36 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షల 40 వేలు దాటింది.
తమిళనాట 4 వేల కేసులు
తమిళనాడులో రోజువారి కరోనా కేసుల సంఖ్య 4 వేలు మార్కును దాటింది. ఒక్కరోజే 4,276 కేసులు నమోదవగా.. 19 ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో మరో 4,353 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11 లక్షల 50 వేలకు చేరువలో ఉంది. తాజాగా 18 మంది కరోనాతో మరణించారు.