మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జ్యోతి గావ్లీ అనే నర్స్ సుమారు 5 వేల మందికి పురుడు పోశారు. అయితే తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఆమె మంగళవారం చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ నెల నవంబర్ 2వ తేదీన హింగోలీలో ప్రజావైద్యశాలలో ఆమెకు రెండో కాన్పు చేశారు అక్కడి వైద్యులు. ఈ క్రమంలోనే గావ్లీకి బైలాటరల్ నిమోనియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో నాందేడ్‌లో చికిత్స తీసుకుంటూ.. చనిపోయారు.
" గావ్లీకి ఈ నెల 2వ తేదీన ప్రసవం జరిగింది. ఆ సమయంలో వచ్చిన కొన్ని సమస్యలు వచ్చాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించాం. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. "