రూ.100 కోట్ల వసూళ్ల వ్యవహారంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
దేశ్‌ముఖ్ వ్యవహారంలో సుప్రీంకు మహా సర్కార్
మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న మహారాష్ట్ర సర్కార్
ముంబయిలోని హోటళ్లు, బార్ల యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ తమకు సూచించారని ఆరోపించారు ఆ నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించింది బాంబే హైకోర్టు. 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐకి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు కోరింది.
ఇదీ చదవండి:'మే 2న టీఎంసీ కథ కంచికే!'
Last Updated : Apr 6, 2021, 6:32 PM IST