తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సముద్రంలో పాక్​ కాల్పులు- భారతీయ జాలరి మృతి - fisherman killed allegedly in firing by Pakistan

పాకిస్థాన్​ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్​ఏ) జరిపిన కాల్పుల్లో మహారాష్ట్రకు చెందిన ఓ మత్స్యకారుడు మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. గుజరాత్​ తీరం వద్ద అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

fisherman killed
భారత పడవపై కాల్పులు

By

Published : Nov 7, 2021, 6:53 PM IST

Updated : Nov 7, 2021, 7:29 PM IST

భారత్​కు చెందిన మత్స్యకారుల పడవపై పాకిస్థాన్​ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్​ఏ) కాల్పులు జరిపింది. గుజరాత్​ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద ఈ ఘటన జరిగింది.

ఈ కాల్పుల్లో మహారాష్ట్ర, ఠాణేకు చెందిన శ్రీధర్​ రమేశ్ చమ్రే(32)అనే మత్స్యకారుడు మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల సమయంలో పడవలో ఏడుగురు ఉన్నట్లు దేవ్​భూమి ద్వారక ఎస్పీ సునీల్ జోషీ తెలిపారు. వీరిలో ఐదుగురు గుజరాత్​కు చెందినవారు కాగా ఇద్దరు మహారాష్ట్ర జాలర్లని వివరించారు.

జాలరి రమేశ్​ చమ్రే మృతదేహాన్ని ఓకా పోర్టుకు ఆదివారం తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోర్​బందర్​ నవీ బందర్​ స్టేషన్​లో కేసు నమోదు అయిందని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదే ఘటనపై ఇండియన్ కోస్ట్​ గార్డ్​(ఐసీజీ) స్పందించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. పడవలోని మరో ఆరుగురు జాలర్లను అరెస్ట్​ చేశామన్న పాక్​ ప్రకటనపైనా ఐసీజీ స్పందించింది. అరెస్ట్​లను తాము ఇంకా ధ్రువీకరించలేదని పేర్కొంది.

Last Updated : Nov 7, 2021, 7:29 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details