కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులు తగ్గిన రాష్ట్రాలు.. అన్‌లాక్‌పై దృష్టి సారిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు సడలింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి.
అన్‌లాక్‌పై రాష్ట్రాల దృష్టి- అక్కడ ఐదంచెల వ్యూహం! - కరోనా ఆంక్షల సడలింపు
కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసులు తగ్గిన రాష్ట్రాలు.. అన్‌లాక్‌పై దృష్టి సారిస్తున్నాయి. మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు సడలింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వం- జూన్ 7 నుంచి అన్‌లాక్!
మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలను అమలు చేసిన మహారాష్ట్ర ఈనెల 7 నుంచి ఆంక్షలను సడలించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వారంలో వచ్చే పాజిటివిటీ రేట్‌ను సహా వినియోగంలో ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను గమనించి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం ఐదు దశల్లో క్రమంగా లాక్‌డౌన్‌ను సడలించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
- లెవెల్-1: పాజిటివిటీ రేటు ఐదు శాతం లేదా అంతకంటే తక్కువ ఉండి, ఆసుపత్రుల్లో పడకలు 25 శాతం కంటే తక్కువ నిండి ఉన్న జిల్లాలు లెవెల్ 1 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తారు. ప్రజా రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్, థియేటర్లు, మాల్స్, పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అనుమతి లభిస్తుంది. వివాహాలు, అంత్యక్రియలు ఎలాంటి నిబంధనలు లేకుండా సాధారణంగా జరుపుకునేందుకు అనుమతిస్తారు.
- లెవెల్-2: ఐదు శాతం పాజిటివిటీ రేటు, ఆసుపత్రుల్లో 25-40 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్2 కిందకు వస్తాయి. ఇక్కడ సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, సెలూన్లు 50 శాతం సామర్థ్యంలో తెరవొచ్చు. ఇతర దుకాణాలు సాధారణ సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది.
- లెవెల్-3: పాజిటివిటీ రేటు 5-10 శాతం, ఆసుపత్రుల్లో 40-60 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్3 కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలు, జిమ్‌లు, సెలూన్లు, రెస్టారెంట్లు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. మాల్స్, థియేట్లు, మూసి ఉంటాయి. సెక్షన్ 144 అమల్లో ఉంటుంది.
- లెవెల్-4:పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 60-75 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్-4 కిందకు వస్తాయి. అన్ని నిత్యవసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 5 గంటలు, వారాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది. పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజా రవాణా 50శాతం సామర్థ్యంతో కొనసాగాలి.
- లెవెల్-5: పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 75 శాతం కంటే ఎక్కువ పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్-5 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది.
Last Updated : Jun 5, 2021, 3:10 PM IST