తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాలో 50 వేల దిగువన కరోనా కొత్త కేసులు

మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. గత నెలరోజుల్లో తొలిసారిగా 50 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో మాత్రం వైరస్​ వ్యాప్తి ఉద్ధృతంగా మారుతోంది. కేరళ, తమిళనాడు, దిల్లీ బంగాల్​ రాష్ట్రాల్లో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది.

corona cases
కరోనా కేసులు

By

Published : May 9, 2021, 11:25 PM IST

మహారాష్ట్రలో రోజువారి కరోనా కేసులు, మరణాల్లో తగ్గుదల నమోదైంది. గత నెలరోజుల్లో తొలిసారిగా 50 వేల కంటే తక్కువ కేసులు బయటపడ్డాయి. ఆదివారం కొత్తగా 48,401 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 572 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కొత్తగా నమోదైన కేసుల కంటే వైరస్​ నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఆదివారం ఒక్కరోజే 60,226 మంది వైరస్​ను జయించారు.

మహారాష్ట్రలో రికవరీ రేటు 86.4 శాతం ఉండగా.. మరణాల రేటు 1.49 శాతమేనని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

కరోనా విలయం..

కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే 47,930 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 490 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉగ్రరూపం

కేరళలో కొత్తగా 35,801 మందికి వైరస్ సోకింది. మరో 68 మంది మరణించారు.

పలు రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో మరో 28,897 మందికి వైరస్​ సోకగా.. 236 మంది మరణించారు.
  • బంగాల్​లో మరో 19,441 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. మరో 124 మంది కరోనాకు బలయ్యారు.
  • రాజస్థాన్​లో ఒక్కరోజే 17,921 మంది కరోనా బారిన పడ్డారు. మరో 159 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 23,333 మంది వైరస్ బారిన పడగా.. 296 మంది మరణించారు.
  • గుజరాత్​లో 11,084 కేసులు వెలుగుచూడగా.. 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • హరియాణాలో మరో 13,548 మందికి వైరస్​ సోకింది. మరో 151 మంది వైరస్​కు బలయ్యారు.
  • పంజాబ్​లో కొత్తగా 8,531 కేసులు నమోదవగా.. 191 మంది చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details