తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్థిక ప్రభావం లేకుండా 'మహా'లో లాక్​డౌన్​! - మహారాష్ట్ర లో కరోనా కేసులు

మహారాష్ట్రలో ఆర్థికరంగంపై అధిక ప్రభావం పడకుండా లాక్​డౌన్​ను ఎలా విధించాలో కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కొవిడ్​-19 రోగుల కోసం పడకల సామర్థ్యం, ఆక్సిజన్​, వైద్య సామాగ్రి.. తదితర అంశాలపై చర్చించారు.

Maha CM mulling lockdown with 'minimum impact on economy'?
'ఆర్థికరంగం పై ప్రభావం పడకుండా లాక్​ డౌన్'​?

By

Published : Mar 28, 2021, 7:20 PM IST

మహారాష్ట్రలో లాక్​డౌన్​పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్​ ఠాక్రే.. ప్రభుత్వ అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్​ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక రంగంపై అధిక ప్రభావం పడకుండా.. లాక్​డౌన్​ను ఎలా విధించాలో కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేష్ తోపె సైతం పాల్గొన్నారు.

కొవిడ్​-19 రోగుల కోసం పడకల సామర్థ్యం, ఆక్సిజన్​, వైద్య సామాగ్రి.. తదితర అంశాలపై ఠాక్రే చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనాను అరికట్టాలంటే కఠినమైన లాక్​డౌన్​ విధించాలని టాస్క్ ఫోర్స్.. ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. లాక్​ డౌన్​ విధించాక ప్రజల్లో ఎలాంటి గందరగోళం ఉండొద్దని సూచించారు ఠాక్రే.

కఠిన ఆంక్షలు

గత వారం నుంచి మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే లక్షమందికి కరోనా నిర్ధరణ కావటం కలకలం రేపుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించింది ప్రభుత్వం​. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించింది. కొవిడ్​ కట్టడిలో భాగంగా ఇప్పటికే పండుగలు, శుభకార్యాలతో పాటు.. రాజకీయ, మతపరమైన ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది.

మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 35,726 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి :'మహా' కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details