ప్రియుడి చేతిలో యాసిడ్, పెట్రోల్ దాడికి గురైన యువతి.. 16 గంటల పాటు నరకం చూసింది. చివరకు ఆసుపత్రిలో ప్రాణం విడిచింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతి స్వస్థలం నాందేడ్ జిల్లాలోని శెల్గావ్. శనివారం రాత్రి ఆమె తన ప్రియుడు అవినాశ్ రాజురె(25)తో కలిసి పుణె నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో యలంబ్ ఘాట్ వద్ద వారు ఓ నిర్జన ప్రదేశంలో ఆగారు. రాత్రి 3 గంటల సమయంలో ఆమెపై ఆ యువకుడు యాసిడ్తో దాడికి దిగాడు. ఆ తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించాడు. నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.
మహారాష్ట్రలో దారుణం-యువతిపై యాసిడ్, పెట్రోల్ దాడి - యాసిడ్ దాడి
మహారాష్ట్ర బీడ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతి తన ప్రియుడి చేతిలో యాసిడ్, పెట్రోల్ దాడికి గురైంది. 16 గంటల పాటు నరకయాతన పడిన బాధితురాలు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
మహారాష్ట్రలో దారుణం-యువతిపై యాసిడ్, పెట్రోల్ దాడి
కాలిన గాయాలతో ప్రాణాల కోసం ఆ యువతి అల్లాడిపోయింది. ఆదివారం మధ్యాహ్నం అటుగా వెళుతున్న కొందరు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. అయితే యాసిడ్ దాడి వెనుక కారణాలు ఇంకా తెలియలేదు.
Last Updated : Nov 16, 2020, 6:37 AM IST