మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. పొప్పడికాయల లోడ్‌తో వెళ్తున్న లారీలో 15మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ధూలే నుంచి జల్గావ్కు బయలుదేరిన లారీ అర్ధరాత్రి ఒంటిగంటకు కింగోన్ సమీపంలో బోల్తా కొట్టింది. ఆ సమయంలో వైద్య సహాయం అందక మృతుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది.
లారీలో ప్రయాణిస్తోన్న 15 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ సహా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5సంవత్సరాల లోపు చిన్నారులు ఇద్దరు.. 15ఏళ్ల బాలిక ఉన్నారు. గాయపడిన వారందరినీ.. జల్గావ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జల్గావ్ జిల్లా రావీర్ పరిధి.. అభోదా, వివ్రా, కెర్హలా గ్రామాలకు చెందిన మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారని పోలీసులు వివరించారు.
సాంకేతిక లోపంతోనే..
సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని జల్గావ్ అదనపు ఎస్పీ చంద్రకాంత్ గౌలీ వివరించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. లారీకి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతర నింబంధన పత్రాలను ఇవ్వాల్సిందిగా రవాణాశాఖను కోరామని తెలిపారు.
రాష్ట్రపతి సంతాపం..