లడ్డూ మ్యాగీ.. ఎప్పుడైనా విన్నారా? పోనీ పెరుగు మ్యాగీ తిన్నారా? ఏంటీ.. ఏదో తేడాగా ఉందే అనిపిస్తోందా? నిజమే.. మనం ఎప్పుడూ ట్రై చేయని వింత మ్యాగీ రెసిపీలతో భయపెట్టేస్తున్నారు కొందరు నెటిజన్లు. మ్యాగీని ఎంతో ఇష్టంగా తినే మనం.. వాటిని చూశాక జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. అయినా ఒకసారి ట్రై చేస్తే పోలే అనుకుంటే.. కానిచ్చేయండి.
లడ్డూ మ్యాగీ..
కారం, తీపి.. రెండు రుచుల్లో లడ్డూ మ్యాగీని చేస్తున్నారు. కారంగా కావలంటే.. ఫ్రైడ్ మ్యాగీని ఎర్రటి క్యాప్సికమ్, ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలు, జున్ను, ఎండు మిర్చి, తులసీ ఆకులతో కలిపి.. పకోడీలు వేయించినట్టు వేయించాలి. తర్వాత సాస్‌తో తినొచ్చు. తీపిగా అంటే.. బెల్లం, ఎలక్కాయ, వెన్నను వేడి చేసి న్యూడిల్స్‌తో కలిపి ఉండలుగా చేసి పెట్టాలి.
మ్యాగీ పానీ పూరీ..