ఎవరైనా పెళ్లికి వెళితే వధూవరులకు కట్నకానుకలు సమర్పించి వస్తారు. కానీ ఈ ఇక్కడ మాత్రం పెళ్లికి వచ్చిన వారికే కానుక ఇచ్చారు. అది కూడా చిన్న వస్తువు కాదండి! రూ. 70 వేలు విలువ చేసే ద్విచక్రవాహనాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. వివాహానికి హాజరైన వారి పేర్లు రాసి లక్కీ డ్రా తీయగా.. వారి బంధువుల్లో ఒకరిని అదృష్టం వరించింది.
పెళ్లిలో లక్కీ డ్రా.. గెస్ట్‌ను వరించిన అదృష్టం.. గిఫ్ట్ ఏంటంటే... - Madurai wedding news
పెళ్లికి హాజరైన ఓ బంధువును అదృష్టం వరించింది. పెళ్లికి వచ్చిన వారి పేర్లు రాసి లక్కీ డ్రా తీయగా అక్కిమ్ అనే వ్యక్తి పేరు వచ్చింది. దీంతో రూ. 70 వేలు విలువ చేసే ద్విచక్రవాహనం కానుకగా ఇచ్చారు. ఈ సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది.
తమిళనాడులోని మదురైకి చెందిన వాసుదేవన్, జ్యోతిప్రియ అనే వధూవరులు.. తమ పెళ్లి వేడుకకు గుర్తుగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనుకున్నారు. దీంతో వివాహానికి హాజరైన వారిలో ఒకరికి ద్విచక్రవాహనాన్ని కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం హాజరైన వారి పేర్లు చిట్టీలు రాసి లక్కీ డ్రా తీయగా.. వారి బంధువైన అక్కిమ్ను అదృష్టం వరించింది. వివాహం అనంతరం ఆయనకు రూ. 70వేల విలువైన ద్విచక్రవాహనాన్ని కానుకగా ఇచ్చారు.
ఇదీ చదవండి:చుక్క నీటి కోసం కోటి తిప్పలు.. ప్రాణాలు లెక్కచేయక పోటాపోటీగా!