తెలంగాణ

telangana

ఉత్సవాల్లో విషాదం.. నదిలో మునిగి ముగ్గురు మృతి.. యాక్సిడెంట్​లో మరో ఐదుగురు..

By

Published : May 6, 2023, 9:05 PM IST

మధురై చితిరయ్​ ఉత్సవాలకు వచ్చి ఐదుగురు మృతి చెందారు. ముగ్గురు నదిలో మునిగి చనిపోగా.. ఒకరు గుండెపోటుతో మృతిచెందారు. మరొకరు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మరోవైపు మహారాష్ట్రలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు.. కారును ఢీకొట్టింది. ఘటనలో తీర్థయాత్రకు వెళుతున్న నలుగురు కుటుంబ సభ్యులు.. ఓ డ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందారు.

madurai-chithirai-festival-2023-several-people-died-in-madurai-chithirai-festival
మధురై చితిరయ్​ ఉత్సవాలు 2023

తమిళనాడులో ఏటా అంగరంగ వైభవంగా జరిగే.. మధురై చితిరయ్​ ఉత్సవాల్లో అపశృతి జరిగింది. కల్లఝగర్ స్వామి.. వైగై నదిలోకి ప్రవేశించడాన్ని చూసేందుకు వచ్చి.. ఐదుగురు భక్తులు మృతి చెందారు. ముగ్గురు నదిలో మునిగి చనిపోగా.. ఒకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు అనుమానాస్పదంగా చనిపోయారు. నది వద్ద పోలీసులు, ఫైర్​,​ రెస్కూ సిబ్బంది భారీగా మోహరించినప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం.

శుక్రవారం ఉదయం కల్లఝగర్ స్వామి.. వైగై నదిలోకి ప్రవేశించే కార్యక్రమం జరిగింది. దీన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు వైగై నది వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఉదయం 10 గంటల ప్రాంతంలో తారాయిపాలెం సమీపాన నదిలో ఓ శవం తేలడాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. మృతుడుని నల్లమాయన్(42)గా పోలీసులు గుర్తించారు. ఇతడు సౌత్​ మాసి స్ట్రీక్​కు చెందినవాడని వారు వెల్లడించారు.

ఆ తరువాత మధ్యాహ్న సమయంలో అదే ప్రాంతంలో మరో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం వారి మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరిని ప్రేమ్​ కుమార్​(18)గా గుర్తించారు. అతడు వెలచేరి ప్రాంతానికి చెందన వ్యక్తి అని తెలిపారు. మరోవైపు, మతిచియంలోని మందగపడి సమీపంలో భక్తులపై నీళ్లు చల్లుతుండగా.. సుదలై ముత్తు(58) అనే ఆటో డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు.

చితిరయ్​ పండుగ తమిళనాడుకు చెందిన ప్రముఖ ఉత్సవాల్లో ఒకటి. ఈ పండగను ఏప్రిల్-మే మధ్యలో పది రోజుల పాటు ఘనంగా జరుపుతారు. భగవంతుడు కల్లఝర్ కల్లార్​ రూపంలో అళగర్ కోవిల్ నుంచి బయలుదేరి పౌర్ణమి నాడు మధురై చేరుకుంటారు. అనంతరం వైగై నదిలోకి ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వైగై నదికి తరలివస్తారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
వేగంగా వస్తున్న ట్రక్కు ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో సహా.. డ్రైవర్​ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో విజాపూర్-గుహగర్ రహదారిపై జాత్ నగరంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వీరంతా తీర్థయాత్ర కోసం జాత్​ నుంచి విజయపుర్​ వెళుతున్నారని వారు వెల్లడించారు. మృతులను మయూరి సావంత్ (38), ఆమె కుమారుడు శ్లోక్(8), తండ్రి నామ్‌దేవ్ (65), తల్లి పద్మిని (60), డ్రైవర్ దత్తా చవాన్ (40) పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం ట్రక్​ డ్రైవర్​ అక్కడి నుంచి పారిపోయాడని వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details