తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2022, 12:44 PM IST

Updated : Mar 15, 2022, 5:06 PM IST

ETV Bharat / bharat

'ఆఫీస్​ టైమ్​లో మొబైల్​ ఫోన్ బ్యాన్'.. ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్

ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆఫీస్​లో వ్యక్తిగత పనుల కోసం ఫోన్​ వాడొద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.

Madras HC
ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత పనుల కోసం కార్యాలయాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించవద్దని ఆదేశించింది. మదురై బెంచ్​ న్యాయమూర్తి ఎస్​ఎం సుబ్రమణ్యం ఈమేరకు తీర్పునిచ్చారు. ఈ విధానం అమలు చేసేందుకు నియమనిబంధనలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా అవి ఉండాలన్నారు.

ఆరోగ్య శాఖకు సంబంధించిన ట్రిచీ జోనల్​ ఆఫీస్​లో సూపర్​వైజర్​గా పని చేస్తున్న రాధిక.. తన డిస్​మిస్ ఆర్డర్​​ను రద్దు చేయాలని మదురై బెంచ్​ను ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం తుది తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఏమన్నారంటే..

" ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వాడటం సర్వసాధారణమైపోయింది.ఇలా తరచూ ఫోన్ వాడటం, దానితో వీడియోలు తీయడం సరికాదు. పని వేళల్లో ప్రభుత్వ ఉద్యోగులు మొబైల్ ఫోన్​ వాడొద్దు. ఒకవేళ అత్యవసరం అయితే పై అధికారుల అనుమతి తీసుకుని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం దీనిపై సర్కులర్​ జారీ చేయాలి. పనివేళల్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి, ప్రభుత్వ అధికారులు ఫోన్ వాడకం, దానితో వీడియోలు రికార్డు చేయడం వంటి వాటిపై నిబంధనలు తీసుకురావాలి. అవసరమైతే ఆఫీస్​లో ప్రత్యేక మొబైల్, లేదా ల్యాండ్​లైన్ ఏర్పాటు చేయాలి. నాలుగు వారాల్లో వీటిని అమలు చేయాలి"

-న్యాయమూర్తి

ఇదీ చదవండి:'వారసత్వ రాజకీయాలు ప్రమాదకరం.. అందుకే వారికి టికెట్ కట్​'

Last Updated : Mar 15, 2022, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details