తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లవర్స్​తో కలిసి భర్తను మేడపై నుంచి తోసిన భార్య!' - మధ్యప్రదేశ్​ ఇందోర్​ వార్తలు

ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను అంతమొందించాలనుకుంది ఓ మహిళ. నాలుగో అంతస్తు నుంచి అతడ్ని కిందకు తోసేసింది. గాయాలపాలయిన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

wife killed husband accused
భర్తపై భార్య హత్యాయత్నం

By

Published : Jul 24, 2021, 10:00 AM IST

Updated : Jul 24, 2021, 10:11 AM IST

ఇద్దరు ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపాలని యత్నించింది ఓ మహిళ. మధ్యప్రదేశ్​లోని ఇందోర్​ ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే...?

ఇందోర్​లోని కనాడియా పోలీస్​ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన భర్త హిమాన్షు చౌహాన్..​ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉంది. హిమాన్షు చౌహాన్​ ఇంటికి వచ్చిచూసేసరికి వారితో ఆమె అభ్యంతకర స్థితిలో కనిపించింది. దీనిపై అతడు వారిని ప్రశ్నించాడు. దాంతో.. తన భార్య సహా ఆమె ఇద్దరు ప్రియులు కలిసి హిమాన్షును నాలుగో అంతస్తు నుంచి కిందకు నెట్టేశారని అతని బంధువులు తెలిపారు. కిందపడిన హిమాన్షకు తీవ్ర గాయాలు కాగా.. అతడిని ఎంవై ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

'వాళ్ల తప్పేం లేదు..'

అయితే.. పోలీసులకు హిమాన్షు మరోలా చెప్పాడు. తనను ఎవరూ కిందకు తోసేయలేదని...తన భార్యతో మాట్లాడుతున్న సమయంలో తానే కాలు జారి కింద పడ్డానని చెప్పాడతడు. ఈ విషయమై హిమాన్షు బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

'అంతా ఆమే చేసింది'

రత్లామ్​లో హిమాన్షు చౌహాన్​ పని చేస్తాడని అతని బంధువులు తెలిపారు. ఇందోర్​లోని తన ఇంటికి వెళ్లినప్పుడు.. తన భార్యే, ఇద్దరు ప్రియులతో కలిసి అతడ్ని కిందకు తోసేసిందని చెప్పారు. దీని గురించి ఎవరితోనైనా చెప్తే.. చంపేస్తానని బాధితుడ్ని తన భార్య బెదింరించిందని అన్నారు.

ఇదీ చూడండి:నారీశక్తి అవార్డు గ్రహీత భగీరథీ అమ్మ ఇకలేరు

ఇదీ చూడండి:బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. హనుమాన్​ చాలీసా పారాయణం

Last Updated : Jul 24, 2021, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details