ఐదుగురు కూతుళ్లు ఉన్న ఓ 45 ఏళ్ల మహిళ.. నాలుగోసారి పెళ్లికి సిద్ధమైంది. అది కూడా 21 ఏళ్ల యువకుడితో. మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామంలో ఈ వింత సంఘటన జరిగింది.
పదిహేనేళ్ల వయసులోనే..
పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు ఆ మహిళకు మొదటిసారి వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత మనస్పర్థలతో భర్తతో విడాకులు తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వినోద్ అనే వ్యక్తితో ఆ మహిళకు రెండోసారి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు సంతానం. అయితే కొన్నేళ్ల తర్వాత వినోద్ ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
భర్త మరణించిన తర్వాత తన ఐదుగురు కుమార్తెలతో కలిసి ఆ మహిళ తన పుట్టింటికి చేరుకుంది. అక్కడ బ్రిజేష్ అనే ఓ యువకుడిని ప్రేమించింది. తన పుట్టింటివారు ఎంత వారించినా ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే.. కొన్నాళ్ల తర్వాత అతడు అనారోగ్యంతో మరణించాడు. అ తర్వాత భిండ్‌కు చేరుకుంది. అక్కడే నివసించింది. తన ఐదుగురు కుమార్తెల్లో ఓ అమ్మాయికి పెళ్లి చేసింది.
బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం..
భిండ్ జిల్లాలోని ఝాన్సీ మొహల్లా ప్రాంతంలో నివసిస్తున్న ఆ మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారు సహజీవనం కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారాన్ని ఆమె కూతుళ్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెండో కుమార్తెను ఇంటి నుంచి ఏడాది క్రితం తరిమేసింది. ఇప్పుడు ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది ఆమె. ముగ్గురు కుమార్తెలు కూడా ఈ పెళ్లికి అడ్డుచెప్పగా.. వారిని కూడా ఆమె తన ఇంటి నుంచి బయటకు పంపించేసింది.
'చంపేస్తానంది..'