మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోటల్‌ను కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి.. చికిత్స అందిస్తోంది ఓ ప్రైవేట్ ఆస్పత్రి. ఇటీవల అక్కడ చేరిన 50ఏళ్ల కొవిడ్ రోగిపై ఓ వార్డ్బాయ్ అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో వార్డ్బాయ్ తనపై రెండుసార్లు లైంగిక వేధింపులకు యత్నించాడని అందులో పేర్కొంది. ఆ సమయంలో తన కుటుంబసభ్యులు అలారం మోగించడం వల్ల.. నిందితుడు పరారయ్యాడని తెలిపింది.