Tunnel Collapse: మధ్యప్రదేశ్‌లోని కట్నిలో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఏడుగురిని రక్షించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. చనిపోయిన కూలీల్లో ఒకరు (గోరాలాల్) మధ్యప్రదేశ్‌కు చెందినవారు కాగ, మరొకరిది (రవి మసల్కర్) మహారాష్ట్రగా గుర్తించారు.
ప్రాణాలతో బయటపడిన ఏడుగురు కూలీలను కట్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.