మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో డిసెంబర్ 9న అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఐపీసీ, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
'గురువారం అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలికను.. నిందితులిద్దరూ ఓ గదిలోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు.' అని గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో 20 ఏళ్ల ఛోటూ కుష్వాహా అనే వ్యక్తితో పాటు.. ఓ బాలుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.