తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళపై అత్యాచారం చేసి, ప్రైవేటు భాగాల్లో కర్ర చొప్పించి - madhya pradesh rape

మహిళపై అత్యాచారం చేసి పాశవికంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. బాధితురాలి జననాంగాల్లోకి కర్ర చొప్పించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

madhya-pradesh-singrauli-rape
madhya-pradesh-singrauli-rape

By

Published : Aug 15, 2022, 12:43 PM IST

మధ్యప్రదేశ్​ సింగ్రౌలీ జిల్లాలో దారుణం జరిగింది. 30ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి, ప్రైవేటు భాగాల్లో కర్ర చొప్పించాడు. ఝుమరియా టోలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడు బాధితురాలి ఇంటి సమీపంలోనే నివసిస్తున్నాడు. మహిళ నిద్రిస్తున్న సమయంలో.. యువకుడు అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. అత్యాచారం చేసి పాశవికంగా ప్రవర్తించాడు. జననాంగాల్లోకి కర్రలను చొప్పించాడు. మహిళ గట్టిగా అరిచేసరికి నిందితుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్​ను అక్కడే పడేసుకున్నాడు. బాధితురాలి అరుపులు విన్న కుటుంబ సభ్యులు.. పొరుగువారి సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మోర్వా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. మహిళకు ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని మోర్వా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ మనీశ్ త్రిపాఠి తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details