తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ నా కుమారుడు.. 25 ఎకరాలు ఆయనకే రాసిస్తా'.. వందేళ్ల బామ్మ ఎమోషనల్! - gift to modi

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ వందేళ్ల వృద్ధురాలు తన 25 ఎకరాల ఆస్తిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసి ఇవ్వనున్నట్లు తెలిపింది. మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తానని చెబుతోంది.

mp old woman news
25 ఎకరాల ఆస్తిని మోదీకి ఇవ్వనున్న మంగీభాయి

By

Published : Jun 26, 2023, 9:49 PM IST

Updated : Jun 26, 2023, 10:38 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపేరున తన 25 ఎకరాల ఆస్తిని రాసిస్తానని మధ్యప్రదేశ్ భోపాల్​కు చెందిన ఓ వంద ఏళ్ల వృద్ధురాలు ప్రకటించింది. మోదీని తన కుమారుడిలా భావిస్తానని అంటోంది. మంగీభాయి తన్వర్​ అనే ఆ వృద్ధురాలు.. రాజ్​గఢ్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో హరిపుర గ్రామంలో నివసిస్తోంది.

మంగీభాయి

ఇదీ కథ...
మంగీభాయికి 14 మంది సంతానం. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, అలాగే తనకు కూడా ఎన్నో పథకాలు అందిస్తున్నారని మంగీభాయి తెలిపింది. ఆయన పేదలకు ఆహార, గృహ వసతి కల్పిస్తున్నారని పేర్కొంది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలు మోదీ తీరుస్తున్నారని బామ్మ చెప్పుకొచ్చింది. అందుకే మోదీని తన 15వ కుమారుడిగా భావిస్తూ.. తన 25 ఎకరాల ఆస్తిని ప్రధాని పేరున రాసి ఇవ్వనున్నట్లు మంగీభాయి స్పష్టం చేసింది.

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న మంగీభాయి

"మోదీ నా 15వ కుమారుడు. అందుకని నా అస్తిని ఆయన పేరున బదలాయించాలని అనుకుంటున్నాను. మోదీ నాకు ఇల్లు ఇచ్చి.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. నాకు వితంతు పెన్షన్ ఇచ్చి ఆర్థిక స్తోమత కల్పిస్తున్నారు. ఆహారం అందిస్తున్నారు. ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగాను అందుకే ఆయన నా కుమారుడు. ఆయన్ను టీవీలోనే చూశాను. అవకాశం ఉంటే స్వయంగా మోదీని కలవాలని ఉంది."
-మంగీభాయి, వృద్ధురాలు

అయితే ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్​ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు వందే భారత్రైళ్లను, రక్తహీనతకు సంబంధించిన హెల్త్ సెంటర్​ను ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మోదీ కమలాపతి రైల్వే స్టేషన్​కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఐదు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

మోదీకి 15 కిలోల వెండి ఇటుక బహుమానం..
గతంలో విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ కోసం కర్ణాటకలోని దావణగెరెకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి.. బీజేపీ నేతలు ప్రత్యేక కానుకను అందించారు. 15 కిలోల వెండితో తయారు చేసిన ఇటుకను బహుకరించారు. రూ. 11 లక్షలతో పుణెలో ప్రత్యేకంగా బీజేపీ నాయకులు తయారు చేయించారు. ఆ ఇటుకపై నాలుగు దిక్కులు.. నాలుగు ఆకృతులను చెక్కారు. ఓ వైపు శ్రీరాముని ప్రతిమ.. మరో వైపు అయోధ్య రామ మందిరం. మిగతా రెండు వైపుల్లో.. జై శ్రీరామ నామం, కమలం గుర్తు ఉంది. వీటితో పాటు 1990లో జరిగిన రామజ్యోతి యాత్ర సమయంలో చనిపోయిన 8 మంది పేర్లు దీనిపై చెక్కారు. మోదీకి ఇచ్చిన బహుమతి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jun 26, 2023, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details