తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఆపై! - మధ్యప్రదేశ్​ రేప్​ న్యూస్

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ బాలుడు. తన దుకాణంలోని బిస్కెట్లు ఇస్తానంటూ ఆశచూపి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

madhya pradesh morena district rape-
ఆరేళ్ల బాలికపై మైనర్ అత్యాచారం.. చెక్కతో..

By

Published : Jul 8, 2021, 3:49 PM IST

ఆరేళ్ల చిన్నారిపై ఓ మైనర్ బాలుడు(15 ఏళ్లు) అత్యాచారం చేసిన అమానుష ఘటన మధ్యప్రదేశ్​, మోరెనా జిల్లాలో జరిగింది. ఆపై బాలిక జననాంగాల్లో చెక్క ముక్కలను ఉంచినట్లు ఆమె తల్లిదండ్రలు ఆరోపించారు.

ఇదీ జరిగింది..

జిల్లాలోని జౌరా గ్రామంలో నిందితుడికి ఓ దుకాణం ఉందని.. తన ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్లు ఇస్తాననే ఆశ చూపి ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు తల్లితండ్రులు ఆరోపించారు. అంతేగాక.. ఆమె ప్రైవేట్ భాగంలో చెక్కను చొప్పించాడని వాపోయారు.

ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడని.. దీనితో పోలీసులు అతని ఇంటిని కూల్చేసేందుకు జేసీబీని తీసుకొచ్చారు. ఆ తర్వాత తమ ఎదుటకు వచ్చి లొంగిపోయాడని, బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details