మద్యం మత్తులో మధ్యప్రదేశ్‌కు చెందిన రాము సింగ్ సిసోడియా అనే యువకుడు వీరంగం సృష్టించాడు. మురైనా పోర్సా టెహ్సిల్ ప్రాంతంలోని స్వాతంత్ర్య సమరయోధుడు సాధు సింగ్ తోమర్ విగ్రహం పైకి ఎక్కాడు. తలతో విగ్రహం పైభాగాన్ని పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు.
యువకుడి ప్రవర్తనను చూసి ఓ స్థానికుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విగ్రహంపై ఉన్న యువకుడిని కర్రతో చితకబాదాడు. అయినప్పటికీ.. రాము కిందకి దిగకుండా విగ్రహాన్ని పగలగొట్టే పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు స్థానికుడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక కిందపడిపోయాడు.