శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యని సందర్శించాలనుకునే వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన క్విజ్ పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
"మధ్యప్రదేశ్ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణం' క్విజ్‌షోను ఏర్పాటు చేస్తోంది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యని ఉచిత విమాన ప్రయాణం ద్వారా సందర్శించుకోవచ్చు. త్వరలోనే పోటీతేదీలను ప్రకటిస్తాం."
-ఉషా ఠాకూర్, మధ్యప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి
రామ్ చరిత్ మానస్.. ఇప్పుడొక సబ్జెక్ట్
ఆర్ట్ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థులు 'రామ్‌చరిత్‌మానస్'ను ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవచ్చని మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా.. 'రామ్ వాన్ గమన్ పథ్' టూరిజం ప్రాజెక్ట్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో కోటి రూపాయలు కేటాయించింది. రాముని వనవాస మార్గాన్ని భక్తులు వీక్షించేందుకు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు.
ఇదీ చూడండి:అయోధ్య రామాలయానికి స్పెషల్ డిజైన్- ఏటా ఆ రోజు గర్భగుడిలో అద్భుతం!
ఇదీ చూడండి:యూపీ ఎన్నికల ప్రచారాస్త్రం అయోధ్యే!