Third Maternity Leave: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల అంశమై కీలక తీర్పు చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఉద్యోగినులు.. విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చితే.. వారికి మూడోసారి ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని ఆదేశించింది. సాధారణంగా రెండు సార్లు మాత్రమే ప్రసూతి సెలవులను అనుమతిస్తారు.
జబల్పుర్లో ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న ప్రియాంక తివారీ.. విడాకులు తీసుకున్న అనంతరం మరో పెళ్లి చేసుకొని గర్భం దాల్చారు. మొదటి వివాహంలో ఆమెకు ఇదివరకే ఇద్దరు పిల్లలున్నారు. సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులకు రెండు సార్లు మాత్రమే ప్రసూతి సెలవులుంటాయి.