దేశంలోనే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో అర్హులకు వీటిని అందించారు. ఇందుకోసం కేటాయించిన ప్రత్యేక పోర్టల్ నుంచి భోపాల్‌కి చెందిన అంజనా సింగ్, ఫారుక్ జమాల్లు ఈ కార్డులు పొందారు.
కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గత నవంబర్లోనే జాతీయ స్థాయిలో వీరికోసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
''ట్రాన్స్జెండర్లు తమ గుర్తింపు కోసం అర్హత కార్డులు పొందాలంటే అధికారుల నుంచి రకరకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ ఆన్లైన్ పోర్టల్ నుంచి వీరు సులువుగా కార్డులు తీసుకోవచ్చు.''