సైబర్ కేటుగాళ్లు.. ఇటీవల రోజుకో రీతిలో కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో కాల్ చేసి.. మహిళల నగ్న దృశ్యాలు చూపిస్తూ, ప్రజలను నట్టేట ముంచుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఈ తరహా ఘటనలపై ఎక్కువ ఫిర్యాదులు రాగా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఎలా చేస్తారంటే?
సైబర్ కేటుగాళ్లు.. కొందరి ఖాతాదారుల ఫోన్ నంబర్లను ర్యాండమ్‌గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత వారికి వీడియో కాల్ చేసి.. మహిళలు నగ్న దృశ్యాలను చూపిస్తారు. అలాంటి కాల్స్‌కు స్పందించినపుడు స్క్రీన్ రికార్డింగ్ అప్లికేషన్ ద్వారా బాధితులు, మహిళలతో చాట్ చేస్తున్నట్టుగా రికార్డ్ చేస్తారు. ఆపై దాన్ని అడ్డంగా పెట్టుకుని డబ్బు డిమాండ్ చేస్తారు. లేదంటే సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు.
ఇదీ చదవండి:'భారత్‌లోని 52% కంపెనీలపై సైబర్ దాడులు'
అపరిచితులతో..