మనసున్నచోట మార్గం ఉంటుందని నిరూపిస్తున్నాడు మధ్యప్రదేశ్ వాసి బ్రజేశ్ శర్మ. మొరెనా జిల్లాకు చెందిన ఆయన.. దేశ విదేశాలలో సుమారు 20వేల కిలోమీటర్లకుపైగా సైకిల్‌పై తిరిగి.. సేంద్రీయ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపైనా తనదైన పాత్ర పోషిస్తోన్న బ్రజేశ్.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం ఏడాది కాలంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. ఇటీవల గుజరాత్ భావ్‌నగర్‌కు చేరుకున్నారు.
ఆ సంఘటనతో కనువిప్పు..
ఐరోపాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోన్న శర్మ.. ప్లాస్టిక్ వ్యర్థాలలో చిక్కుకున్న ఓ పక్షి వీడియోను చూసి చలించిపోయారు. అప్పటినుంచి ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణానికి తీరని హాని చేస్తోందని గమనించారు. సైకిల్ ర్యాలీ చేస్తూ ప్రపంచదేశాలకు ప్రకృతిపై అవగాహన కల్పించడం ప్రారంభించారు. తన యాత్రలో భాగంగా భారత్‌లో ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలను చుట్టేశారాయన. అందులో 105 నగరాలు, 8 వేలకుపైగా గ్రామాలు సహా.. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
సేంద్రీయ వ్యవసాయంపై రైతులతో మాటామంతీ..