తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆవులకు కృత్రిమ కాళ్లు.. దేశంలోనే తొలిసారి! - ఆవులకు కృత్రిమ కాళ్లు

మనుషుల్లాగే జంతువులకూ కృత్రిమ కాళ్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా.. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో వీటిని తయారు చేసేందుకు ఓ కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రభుత్వం దీనికి నిధులు​ కూడా కేటాయించింది.

MADHYA PRADESH became the first state to make artificial legs for animals
ఆవులకు కృత్రిమ కాళ్లు

By

Published : Oct 19, 2021, 5:15 PM IST

ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది. కాళ్లు, చేతులు విరిగిపోవడం దగ్గర నుంచి శరీరంలోని ఏ అవయవం పాడైనా కృత్రిమంగా అమర్చగల విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఇది మనుషులతోనే ఆగిపోలేదు. ఇప్పుడు జంతువులకు కూడా కృత్రిమ కాళ్లు అమర్చనున్నారు. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని నానాజీ దేశ్​ముఖ్​ విశ్వవిద్యాలయంలో.. వీటిని తయారుచేయగలిగే ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం.. ప్రత్యేకంగా రూ. 2 కోట్ల 17 లక్షలు కేటాయించింది.

నానాజీ దేశ్​ముఖ్​ వెటర్నరీ యూనివర్సిటీ

నాలుగేళ్లుగా దీనిగురించే..

జంతువులకు కృత్రిమ కాళ్లు అమర్చాలనే ఆలోచన.. నానాజీ దేశ్​ముఖ్​ పశు విశ్వవిద్యాలయంలో పనిచేసే డా. శోభా జావ్రేది. నాలుగేళ్ల కింద కణితి కారణంగా.. ఓ లేగదూడ కాలును తొలగించారు వైద్యులు. అప్పుడే కృత్రిమ కాలు తయారుచేయాలని సంకల్పించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. మనుషులకు కృత్రిమ కాలు తయారుచేసే డా. రాజేశ్​ అహిర్వార్​ను కలిశారు. ఆయన.. ఆవు కోసం కూడా కృత్రిమ కాలు తయారుచేశారు. ఇది చాలావరకు విజయవంతమైంది.

ఆవుకు అమర్చిన కృత్రిమ కాలు

డా. రాజేశ్​ పర్యవేక్షణలో.. ప్రస్తుతం మరో నాలుగు ఆవులకు కృత్రిమ కాళ్లు తయారుచేసే పనిలో ఉన్నారు డా. శోభా. త్వరలో ఎద్దులు, ఇతర జంతువులకు వీటిని అమర్చే ప్రయత్నాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

తొలుత రూ. 75 లక్షలతో ప్రత్యేక భవనం నిర్మిస్తామని, అందులో అన్ని వసతులు సమకూర్చుతామని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో వాళ్లందరికీ ఏకే-47లు ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details