మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ- ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే? - Kamalnath winning chances in MP elections
MP Elections Exit Poll 2023 LIVE Updates In Telugu : మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇరుపార్టీలు 100 నుంచి 120 స్థానాలు సాధించవచ్చని అంచనా వేస్తున్నాయి.
Madhya Pradesh Election Exit Poll Results 2023 LIVE Updates :మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
టీవీ9- భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్
జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
80
బీజేపీ
138
ఇతరులు
12
సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
92
బీజేపీ
128
ఇతరులు
10
CSDS ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
72
బీజేపీ
141
ఇతరులు
17
ఏబీపీ-నీల్సన్ ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
80
బీజేపీ
138
ఇతరులు
12
కాంగ్రెస్ - భాజాపా హోరాహోరీ :మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కొన్నిసర్వేలు భాజపాకు, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అధికారం రావొచ్చని వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో మళ్లీ భాజపాదే అధికారం అని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ తెలిపింది. భాజపాకు 139 నుంచి 163 స్థానాలు,కాంగ్రెస్ 62 నుంచి 86 స్థానాలు, ఇతరులు 1 నుంచి 9 చోట్ల గెలిచే అవకాశముందని పేర్కొంది.
దైనిక్-భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, మధ్యప్రదేశ్‌లో భాజపాకు 95 నుంచి 115 స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ 105 నుంచి 120 స్థానాలు, ఇతరులు 15 స్థానాలు గెలవచ్చని తెలిపింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకుగాను.. కమలదళం 118 నుంచి 130 సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 97 నుంచి 107 సీట్లు రావొచ్చని తెలిపింది. జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్ భాజపాకు 100 నుంచి 123 స్థానాలు, కాంగ్రెస్‌కు 102 నుంచి 125 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. పీపుల్ పల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ అధికారంలోకి రావొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ 117 నుంచి 139 స్థానాలు, భాజపా 91 నుంచి 113 స్థానాలు గెలిచే అవకాశముందని పేర్కొంది. టీవీ9-భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్.. భాజపాకు 106 నుంచి 116 స్థానాలు, కాంగ్రెస్ 111 నుంచి 121 స్థానాలు, ఇతరులు 6 స్థానాలు గెలవచ్చని అంచనా వేసింది.
పెరిగిన ఓటింగ్ శాతం! మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరిగింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 14న జరిగిన ఎన్నికల్లో 76.22 శాతం పోలింగ్ నమోదయ్యింది. అంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.97 శాతం పోలింగ్ నమోదు అవ్వగా.. తాజా ఎన్నికల్లో 1.25 శాతం అధికంగా పోలింగ్ జరిగడం విశేషం.
నువ్వా - నేనా మధ్యప్రదేశ్‌లో గత 20 ఏళ్లలో దాదాపు 18 సంవత్సరాలు పాలించిన బీజేపీ ఇప్పుడు మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని.. కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది.
సెమీ ఫైనల్స్! ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 3న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. వీటిని ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.