తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణ పోలీసులను తిప్పలు పెట్టిన లగ్జరీ కార్ల దొంగ అరెస్ట్ - సత్యేంద్ర సింగ్ శెకావత్

luxury car thief arrested: వందకు పైగా లగ్జరీ కార్లు చోరీ చేసిన దొంగను కర్ణాటక అమృతహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరి తప్పించుకు తిరుగుతున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు.

luxury car thief arrested
luxury car thief arrested

By

Published : Mar 2, 2022, 7:55 PM IST

luxury car thief arrested: లగ్జరీ కార్లు చోరీ చేస్తూ తెలంగాణ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన అంతర్రాష్ట్ర దొంగ సత్యేంద్ర సింగ్ శెకావత్​ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన కార్లను నిందితుడు దొంగలించాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగ.. తెలంగాణ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని వెల్లడించారు.

నిందితుడు సత్యేంద్ర సింగ్ శెకావత్

లగ్జరీ కార్లే లక్ష్యంగా చేసుకొని సత్యేంద్ర చోరీలకు పాల్పడేవాడు. వందకు పైగా ఖరీదైన కార్లను దొంగలించాడు. డ్రగ్ మాఫియా, మానవ అక్రమ రవాణా ముఠాలకు వీటిని సరఫరా చేసేవాడని పోలీసులు తెలిపారు. ఆటోమెటిక్ కార్లను హ్యాక్ చేసి వాటిని దొంగలిస్తున్నాడని వివరించాడు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆడీ కారు

"నిందితుడు గతకొద్ది సంవత్సరాల నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. కన్నడ నిర్మాత మంజునాథ్ గతేడాది హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో తన కారును పోగొట్టుకున్నాడు. ఈ కేసులో బంజారాహిల్స్​ పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రాజస్థాన్​లోని జైపుర్ వరకు వెళ్లారు. 'మీకు సాధ్యమైతే నన్ను పట్టుకోండి' అని వాట్సాప్ ద్వారా పోలీసులకే సవాల్ విసిరాడు."

-కర్ణాటక పోలీసులు

ఈ గజదొంగపై బెంగళూరులో 10 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న అమృతహళ్లి పోలీసులు.. తదుపరి విచారణను ముమ్మరం చేశారు. నాలుగు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్

ABOUT THE AUTHOR

...view details