తెలంగాణ

telangana

By

Published : May 5, 2022, 6:17 PM IST

ETV Bharat / bharat

బైక్స్​ రీడిజైనింగ్​లో కింగ్.. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ ఫిదా!

ఆ యువకుడు చదివింది బీ-ఫార్మసీ. అతడి కుటుంబంలో అందరూ వైద్యులే. కానీ, అతడికి మాత్రం వైద్య రంగంలో స్థిరపడాలని లేదు. చిన్నప్పటి నుంచి బైక్​ మోడిఫికేషన్​ చేయడమంటే చాలా ఇష్టం. అదే తన వృత్తిగా మలుచుకున్నాడు. సోదరి సాయంతో గ్యారేజ్​ ప్రారంభించాడు. ఇప్పటివరకు తన గ్యారేజ్​లో కొన్ని వేల బైక్​లను మోడిఫై చేసి.. బాలీవుడ్​ తారలను, క్రికెటర్లను, విదేశీయులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అతడే పంజాబ్​కు చెందిన అనూజ్​ సైనీ.

King of motorcycles
King of motorcycles

మోడిఫైడ్​ బైక్​లతో ఆకట్టుకుంటున్న అనూజ్​ సైనీ

Famous Bike Modification Garrage: పంజాబ్​లోని లుథియానాకు చెందిన అనూజ్ సైనీ అనే యువకుడు తన మోడిఫైడ్ బైక్‌లతో బాలీవుడ్‌ తారలతో పాటు క్రికెటర్లు, విదేశీయులను ఆకట్టుకుంటున్నాడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అనూజ్ మోడిఫై చేసిన బైక్‌లపై ఆసక్తి కనబరుస్తోంది. ఈ గ్యారేజీని 11 ఏళ్ల క్రితం అనూజ్ ప్రారంభించాడు. అనూజ్​ బీ-ఫార్మసీ చదివినప్పటికీ తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన బైక్​ మోడిఫికేషన్​ గ్యారేజ్​ను ప్రారంభించాడు. సోషల్ మీడియాలో అనూజ్​ బైక్​లకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. యువత ఆ వీడియోలను చూసి తమ బైక్‌లను మోడిఫై చేయాలని ఆర్డర్ చేస్తున్నారు. అనూజ్​ తన గ్యారేజీలో హార్లీ డేవిడ్‌సన్ వంటి బైక్‌లను కూడా రీమోడల్ చేశాడు.

అనూజ్​ మోడిఫై చేసిన బైక్​
అనూజ్​ మోడిఫై చేసిన బైక్​
అనూజ్​ మోడిఫై చేసిన బైక్​

అమెరికాలో స్టోర్​ తెరవడమే నా డ్రీమ్​ ప్రాజెక్ట్.. తన బైక్‌లను కొందరు బాలీవుడ్ నటులు కొనుగోలు చేశారని చెప్పాడు అనూజ్ సైనీ. ఒక క్రికెటర్ కూడా తన దగ్గర బైక్‌ను దాదాపు రూ.20 లక్షలకు ఆర్డర్ చేశాడని, అయితే వారి పేర్లను వెల్లడించలేనని అన్నాడు. తాను తయారు చేసిన బైక్​లను దక్షిణాది సినిమాల్లోనూ ఉపయోగిస్తున్నారని తెలిపాడు. అమెరికాలో స్టోర్ తెరవడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనూజ్ అంటున్నాడు. తాను మోడిఫై చేసిన బైక్‌లపై భారతీయులంతా గర్వపడేలా మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉండాలని అన్నాడు. బైక్ విడిభాగాలు భారతదేశంలో లభిస్తాయని.. లైట్లు, టైర్లు మాత్రమే అమెరికా నుంచి ఆర్డర్ చేస్తానని అనూజ్ చెప్పాడు.

అనూజ్​ మోడిఫై చేసిన బైక్​
​బైక్​ మోడిఫై చేస్తున్న అనూజ్​

"మొదటి రెండు, మూడేళ్లు అమ్మకాలు భారత్​కే పరిమితయ్యాయి. ఆ తర్వాత క్రమంగా అమెరికా, కెనెడా, దుబాయ్​ల నుంచి కూడా ప్రీమియం బైక్​ మోడళ్లకు భారీ ధరకు ఆర్డర్లు వచ్చేవి. నా సోదరి నాకు అండగా నిలిచింది. తను ఇచ్చిన రూ.18వేలతోనే సామాన్లు కొన్నాను. నా మొదటి ఆర్డర్​ గుజరాత్​ నుంచి వచ్చింది. ఆ తర్వాత దానిని సోషల్​ మీడియాలో పోస్ట్ చేశాక బంగాల్​ నుంచి మరో ఆర్డర్​ వచ్చింది. ఇలా సోషల్​ మీడియా ద్వారా ఆర్డర్లు రావడం పెరిగాయి."

-అనూజ్​ సైనీ, గ్యారేజీ యజమాని

బైక్ మోడిఫికేషన్​ కోసం అనూజ్​ సొంతంగా ఓ మోడల్ తయారు చేసి.. దాని ప్రకారం ముందుకు వెళ్తాడు. ఇతరుల డిజైన్​ను ఎప్పూడూ కాపీ చేయడట. వచ్చిన సంపాదనలో ఖర్చులకు తీసుకుని మిగతా మొత్తాన్ని మళ్లీ పెట్టుబడిలో పెడతాడు. అనూజ్​ తన కెరీర్‌ను రూ.18,000 మదుపు పెట్టి ప్రారంభించాడు. ప్రస్తుతం అతడి గ్యారేజీలో కొన్ని కోట్ల రూపాయల విలువైన బైక్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి:36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు.. ఘనంగా పెళ్లి

ABOUT THE AUTHOR

...view details