Ludhiana Court Blast: పంజాబ్‌లోని లుథియానా కోర్టు వద్ద ఇటీవల జరిగిన పేలుడుకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు జర్మనీ పోలీసులు. నిందితుడు సిఖ్ ఫర్ జస్టిస్‌కు (ఎస్ఎఫ్జే) చెందిన జస్వీందర్ సింగ్ ముల్తానీగా గుర్తించారు అధికారులు. నిఘా వర్గాల సమాచారం మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. జస్వీందర్‌కు కోర్టు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పేలుడులో మృతిచెందిన నిందితుడు గగన్‌దీప్ వద్ద ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.
జస్వీందర్‌పై ఇప్పటికే పంజాబ్‌లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత అధికారుల సమాచారం ఆధారంగా జర్మన్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ పేలుడుకు ఖలీస్థానీ ఉగ్రవాదులకు సంబంధంపై ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
Jaswinder Singh Multan