తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2021, 3:31 PM IST

Updated : Oct 20, 2021, 6:17 PM IST

ETV Bharat / bharat

ఉద్రిక్తతల అనంతరం ఆగ్రా వెళ్లేందుకు ప్రియాంకకు అనుమతి

నాటకీయ పరిణామాల మధ్య ప్రియాంకా గాంధీ వాద్రాను(priyanka gandhi latest news ) ఆగ్రా వెళ్లేందుకు అనుమతించారు యూపీ పోలీసులు. అంతకుముందు పోలీస్​ కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆమె కాన్వాయ్​ను అడ్డుకున్నారు. చివరకు నలుగురికి అనుమతిచ్చారు.

Lucknow: Priyanka Gandhi Vadra & her convoy stopped by Police on their way to Agra
ప్రియాంక కాన్వాయ్​ను అడ్డుకున్న పోలీసులు

ఉద్రిక్తతల అనంతరం కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను(priyanka gandhi latest news ) ఆగ్రా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్​ప్రెస్​వేపై ఆమె కాన్వాయ్​ను అడ్డుకున్న అనంతరం కాసేపటికి నలుగురు వెళ్లేందుకు అంగీకారం తెలిపారు. దీంతో ప్రియాంకతో మరో నలుగురు ఆగ్రా వెళ్తున్నారు.

ఉద్రిక్తతలు..

ప్రియాంక కాన్వాయ్​ను అడ్డుకున్న పోలీసులు

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ దొంగతనం కేసులో అరెస్టయిన పారిశుద్ధ్య కార్మికుడు పోలీస్​ కస్టడీలోనే మరణించాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక ఆగ్రా వెళ్తున్నారు(priyanka gandhi news today). అయితే అక్కడకు వెళ్లేందుకు రాజకీయ నేతలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్​ నుంచి ఆదేలున్నాయని, ప్రియాంకను యూపీ పోలీసులు తొలుత అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు భారీగా తరలిరావడం వల్ల కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. ఆ తర్వాత ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి విడిచిపెట్టారు.

ప్రియాంక కాన్వాయ్​ను అడ్డుకున్న పోలీసులు

ప్రియాంక అసహనం..

ప్రియాంక కాన్వాయ్​ను అడ్డుకున్న పోలీసులు

పోలీసుల తీరుపై ప్రియాంక (priyanka gandhi lucknow) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను లఖ్​నవూ నుంచి ఎక్కడకు బయల్దేరినా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు(priyanka gandhi news). తాను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు తప్ప మరెక్కడికీ వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. పదే పదే తనను రోడ్డుపై అడ్డుకోవడం వల్ల ప్రజలకు కూడా అసౌకర్యం కలుగుతుందని అన్నారు.

" లఖ్​నవూ నుంచి బయటకు వెళ్లే ప్రతిసారి నేను ఇతరుల అనుమతి తీసుకోవాలా? నన్ను ఆగ్రా వెళ్లేందుకు ఎందుకు అనుమతించడం లేదు? శాంతి భద్రతల సమస్య ఏమైనా ఉందా? ఒకరు చనిపోతే అది శాంతి భద్రతల సమస్య ఎలా అవుతుంది? కలెక్టర్​కు ఫోన్​ చేసి అడగండి. నేను లఖ్​నవూలో గెస్ట్ హౌస్​లోనే ఉండాలా? ఎక్కడకూ వెళ్లొద్దా? చాలా అతి చెేస్తున్నారు."

-ప్రియాంకా గాంధీ వాద్రా.

రూ.25లక్షల చోరీ కేసు..

ఆగ్రా జగదీశ్​పుర పోలీస్​ స్టేషన్​లో పోలీసులకు సంబంధించిన వస్తువులు ఉండే మాల్​ఖానాలో రూ.25లక్షల దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీస్​ సిబ్బందిని ఏడీజీ సస్పెండ్ చేశారు. మాల్​ఖానాలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అక్కడే పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నిందితుడు అరుణ్​ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీస్​ కస్టడీలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే దొంగతనం చేసింది తానే అని అరుణ్​ విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు. అతడిచ్చిన సమాచారం మేరకే అతని ఇంట్లో రూ.15 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇంట్లో సోదాలు జరుగుతున్న సయమంలోనే అరుణ్ ఆరోగ్యం క్షీణించిందని, ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

పోలీసుల దెబ్బలు తట్టుకోలేకే అరుణ్​ కస్టడీలో మరణించాడని ప్రియాంక గాంధీ ఆరోపించారు. చనిపోయేలా కొట్టడం ఏం న్యాయమని ప్రశ్నించారు. వాల్మీకి జయంతి రోజే యూపీ పోలీసులు ఆయన సందేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే అరుణ్​ కుబుంటాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా... పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

అరుణ్ మృతిపై వాల్మీకీ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలన డిమాండ్​ చేసింది.

యూపీ మాజీ సీఎం మాయావతి కూడా ఈ ఘటనను ఖండించారు. పోలీసు కస్టడీలో పారిశుద్ధ్య కార్మికుడు మరణించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:విమానంలో నటిపై వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్​

Last Updated : Oct 20, 2021, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details