Wife swapping news: ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ కుటుంబ కోర్టు ముందుకు వచ్చిన ఓ కేసు చర్చనీయాంశమైంది. తన భార్య నుంచి విడాకులు కావాలని భర్త పిటిషన్ దాఖలు చేశాడు. కానీ అతడు చెప్పిన కారణం విని న్యాయమూర్తులే షాకయ్యారు. కోర్టు వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. రాజేశ్, దినేశ్ (పేరు మార్చాం) కాలేజ్ రోజుల నుంచి మంచి స్నేహితులు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అయితే వారికి భార్యలను మార్చుకోవాలన్న పాడు ఆలోచన వచ్చింది. దీనికి వారు కూడా అంగీకారం తెలిపారు. దీంతో చాలాసార్లు ఇద్దరూ తమ భార్యలను మార్చుకున్నారు.
అయితే ఇలా తరచూ జరుగుతుండటం వల్ల రాజేశ్ భార్య.. దినేశ్ పట్ల ఆకర్షితురాలయ్యింది. ఈ విషయం తెలిసి రాజేశ్ సహించలేకపోయాడు. దీంతో తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని లఖ్నవూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని, కలసి ఉండలేనని కోర్టుకు చెప్పాడు. పరస్పర అంగీకారంతోనే భార్యలను మార్చుకున్నందున ఈ కేసు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.