తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. తల్లిదండ్రులను ఎదురించి మరీ ఒక్కటైన జంట!

ప్రేమ చాలా విచిత్రమైనది. ఎవరి మీద ఎప్పుడు, ఎలా కలుగుతుందో చెప్పలేం. అది వేరే జెండర్ వ్యక్తుల మీదనే రావాలని లేదు. తోటి జెండర్ ఉన్న వారి మీద కలుగవచ్చు. జీవితాన్ని గడపటానికి అర్థం చేసుకొని.. ప్రేమించే మనసు ఆ వ్యక్తికి ఉంటే చాలు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరమ్మాయిలు సైతం ఇదే అనుకున్నారు.

lucknow girls fell in love gets nod from police to live together
పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు ఉత్తర్​ప్రదేశ్ అమ్మాయిలు

By

Published : Mar 6, 2023, 7:44 AM IST

వాళ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. మనసులు కలిసాయి. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి ఒక్కటవ్వాలనుకున్నారు. జీవితాంతం కలిసి నడవాలనుకున్నారు. ఒకే జెండర్​కు చెందిన వారు పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని భావించారు. వ్యక్తిగతంగా ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా వద్దనుకొని వారికి ఒకరితో ఒకరు జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరికి పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించినా మారకుండా కలిసి జీవించాలనే ఆశతో ముందగుడు వేశారు ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన ఇద్దరమ్మాయిలు.

లఖ్​నవూలో ఉండే ఇద్దరు అమ్మాయిలు చిన్ననాటి నుంచి చాలా మంచి స్నేహితులు. తరచూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేవారు. వీరు అంత సన్నిహితంగా ఉంటూ ఒకరి ఇంట్లో ఒకరు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. మెల్లగా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొదట్లో ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియక తమ కుమార్తెలకు పెళ్లి చేసేందుకు యువకులను వెతికారు. చాలా కుటుంబాల నుంచి వివాహ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ వాటిని అమ్మాయిలు నిరాకరించారు. చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పేశారు.

జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి జీవించాలనుకుంటున్నామని బాలికలు శనివారం చెప్పగా.. వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అప్పుడే వీరి ప్రేమ వ్యవహారం తమకు తెలిసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకరికోసం ఒకరు కలిసి జీవించాలని బాలికలు మొండిగా ఉన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఇద్దరు అమ్మాయిలను ఒప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మాయిలు వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు. వారు చేసుకున్న నిర్ణయం మీదే కట్టుబడి, కలిసి జీవించాలని పట్టుబట్టి కూర్చున్నారు. చేసేదేమి లేక తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా అమ్మాయిలను రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు రహీమాబాద్ ఇన్‌స్పెక్టర్ అక్తర్ అహ్మద్ అన్సారీ తెలిపారు.

మహిళా పోలీసులు అమ్మాయిలకు చాలా సేపు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు మొండిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అమ్మాయిలు తమ ఆధార్ కార్డులను చూపించి, తాము మేజర్లమని చెబుతున్నట్లు పేర్కొన్నారు. తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఉందని అంటున్నారు. దీంతో పోలీసులు చేసేదేమి లేక అమ్మాయిలను ఒకరితో ఒకరు ఉండడానికి అనుమతించారు. వారి తల్లిదండ్రులు నిరుత్సాహంగా వారి ఇళ్లకు వెళ్లిపోయారు.

న్యాయపోరాటం చేసి మరీ..
ఇటీవల కేరళకు చెందిన ఇద్దరు యువతులు సైతం ఇలాగే తల్లిదండ్రులను ఎదురించి ఒక్కటయ్యారు. తమ బంధానికి అడ్డుగా ఉన్న నిబంధనలపై హైకోర్టులో పోరాడారు. అదిలా నసరిన్, ఫాతిమా నూర అనే ఇద్దరు యువతులు న్యాయపోరాటం చేసి మరీ ఏకమయ్యారు. ఆ యువతుల లవ్ స్టోరీకి సంబంధించిన ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

అదిలా నసరిన్, ఫాతిమా నూర

ABOUT THE AUTHOR

...view details