సైన్యంలోని మిలటరీ ఆపరేషన్స్ విభాగం తదుపరి డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ)గా.. లెఫ్టినెంట్ జనరల్ బి.ఎస్. రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే అనంతరం రాజు బాధ్యతలు స్వీకరిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ బదిలీ ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
మిలటరీ ఆపరేషన్స్ తదుపరి డీజీగా బి.ఎస్. రాజు
భారత ఆర్మీ నూతన డీజీఎంఓగా నియమితులయ్యారు లెఫ్టినెంట్ జనరల్ బి.ఎస్. రాజు. ప్రస్తుతం ఆయన చినార్ కార్ప్స్కు జనరల్ కమాండింగ్ అధికారిగా ఉన్నారు.
మిలటరీ ఆపరేషన్స్ తదుపరి డీజీగా బి.ఎస్. రాజు
ప్రస్తుతం శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తోన్న కీలక చినార్ కార్ప్స్కు జనరల్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు రాజు. కశ్మీర్లో పలు క్లిష్టమైన ఉగ్రవాద ఆపరేషన్లలో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉంది.
ఇదీ చూడండి:'జమ్ముకశ్మీర్‌కు ఇప్పటికీ ఉగ్రముప్పు'