కర్ణాటక శాసస మండలి డిప్యూటీ స్పీకర్ ధర్మెగౌడ ఆత్మహత్య కేసుపై స్వతంత్ర సంస్థతో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అన్నారు. ఆయన మృతి తనను కలచివేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ధర్మెగౌడ సభలో కూర్చుకున్నప్పుడు జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు బిర్లా. ఆయనపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన తీవ్రదాడిగా పేర్కొన్నారు. ధర్మెగౌడ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
శాసనసభల ప్రతిష్ఠ , ప్రిసైడింగ్ అధికారుల స్వేచ్ఛ, గౌరవాలను కాపాడటం మనందరి కర్తవ్యం అవి బిర్లా అన్నారు.