తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీరు వంటగ్యాస్ కేవైసీ కోసం ఏజెన్సీకి పరిగెడుతున్నారా? - ఇంట్లో నుంచే ఈజీగా ఇలా పూర్తి చేయండి! - Online LPG Gas KYC Process In Telugu

LPG KYC Process in Online : కేంద్ర ప్రభుత్వం ఎల్​పీజీ గ్యాస్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. లేదంటే సబ్సిడీ రాదని చెప్పడంతో.. జనాలు మీ సేవా కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్​లకు క్యూ కడుతున్నారు. అయితే.. ఈ-కేవైసీ ఇంట్లోనే ఉండి ఆన్​లైన్​ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

E KYC
LPG KYC Process in Online

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 4:08 PM IST

LPG KYC Process in Online :ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. KYC పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు.. వంటగ్యాస్ ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే తెలంగాణలో రూ.500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తారని, చేయించుకోని వారు పూర్తి డబ్బులు చెల్లించాలని సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో.. తాము ఎక్కడ నష్టపోతామో అనే ఆందోళనతో లబ్ధిదారులంతా మీ సేవా కేంద్రాలు, గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. వంట గ్యాస్ ఈ-కేవైసీ అందరూ పూర్తి చేయాలని సూచించింది. అయితే.. ఈ పని ఇంటి నుంచి కూడా ఆన్​లైన్​లో పూర్తి చేయవచ్చు. మరి అది ఎలా చేయాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ద్వారా గ్యాస్ ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలంటే..?

  • ముందుగా మీరు ఎల్‌పీజీ గ్యాస్ అధికారిక వెబ్‌సైట్ www.mylpg.in లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత అక్కడ కుడివైపు పైన భారత్ గ్యాస్/HPగ్యాస్/ఇండేన్ సిలిండర్​ బొమ్మలు కనిపిస్తాయి.
  • అందులో మీ గ్యాస్ ఏ కంపెనీది అయితే.. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో కుడివైపు పైన Sign In, New User ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నంబర్‌తో సైన్ ఇన్ అవ్వాలి. లేదంటే New User అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • New User పేజ్​లోకి వెళ్లిన తర్వాత గ్యాస్ కన్య్జూమర్ నంబర్ సహా.. అడిగిన వివరాలన్నీ సమర్పించాలి.
  • ఆ తర్వాత ఐడీతో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు స్క్రీన్​పై మీ గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాలన్నీ డిస్​ప్లే అవుతాయి.
  • ఇప్పుడు ఎడమ వైపు కనిపించే 'ఆధార్ అథెంటికేషన్' ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి.
  • అంతే ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ పూర్తియినట్లు మెసేజ్ వస్తుంది.
  • ఒకవేళ మీరు KYC స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే.. ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్​పై మరోసారి క్లిక్ చేయండి.
  • అప్పుడు ఈ-కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారనే మెసేజ్ వస్తుంది.

ఆఫ్‌లైన్​లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటే.. కేవైసీ ఫారమ్ నింపి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో మీ KYC ప్రక్రియ పూర్తవుతుంది.

ABOUT THE AUTHOR

...view details