తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదేళ్లలో 42% పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. 92% తగ్గిన రాయితీ

2018లో ఎల్​పీజీ సిలిండర్‌ ధర రూ.741 ఉండగా, 2023 ఫిబ్రవరి 1 నాటికి అది రూ.1,053కు చేరినట్లు కేంద్రం తెలిపింది. ఇది 42 శాతం పెరుగుదల అని వెల్లడించింది.

lpg cylinder price in india 2023
ఐదేళ్లలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

By

Published : Feb 7, 2023, 7:30 AM IST

గత ఐదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ పలు వివరాలతో సమాధానమిచ్చారు. 2018 జనవరి 1 నాడు 14.2 కేజీల గృహావసర ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.741 ఉండగా, 2023 ఫిబ్రవరి 1 నాటికి అది రూ.1,053 (42.10%)కి చేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఎల్‌పీజీపై కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ 2017-18లో రూ.23,464 కోట్లమేర ఉండగా, 2021-22లో అది రూ.1,811 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఐదేళ్లలో ఎల్‌పీజీ సబ్సిడీ పొందే వారి సంఖ్య 20,21,20,070 నుంచి 28,36,77,886 (40.35%పెరుగుదల)కి చేరినట్లు తెలిపారు.

కేంద్ర పెట్రో ఆదాయం 5 ఏళ్లలో 46% పెరుగుదల..
పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయం గత ఐదేళ్లలో 46% పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం మాత్రం 36% మాత్రమే పెరిగిందని సహాయమంత్రి రామేశ్వర్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.31,21,173 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.19,65,891 కోట్లు చేరగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.11,55,282 ఆదాయం చేకూరినట్లు తెలిపారు. 2017-18లో కేంద్ర ఖజానాకు రూ.3,36,163 ఆదాచం రాగా, 2021-22నాటికి రూ.4,92,303 కోట్లకు పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రాల ఆదాయం ఇదే సమయంలో రూ.2,06,863 కోట్ల నుంచి రూ.2,82,122 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details