అప్పటికే వివాహమైన ఓ వ్యక్తి మరో యువతితో ఆరేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. తీరా యువతికి మరో వ్యక్తితో పెళ్లి కుదిరాక.. ఇరువురి ప్రేమ విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు వారిద్దరిని దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో షాహ్జహాన్పుర్ (Shahjahanpur News) జరిగింది.
ఇదీ జరిగింది..
జిల్లాకు(Shahjahanpur News Today) చెందిన ఆశిష్ కుమార్(25), బంటి(21) ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఆశిష్‌కు అప్పటికే ఓ మహిళతో వివాహం జరగ్గా.. రెండు వారాల క్రితమే అతడు ఓ బిడ్డకు తండ్రయ్యాడు. మరోవైపు బంటికి ఇటీవలే తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. నవంబర్‌లో వివాహం కూడా జరుపుదామని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులకు.. ఆశిష్-బంటి ప్రేమాయణం గురించి తెలిసింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన బంటి కుటుంబ సభ్యులు.. ఇరువురినీ తూపాకీతో కాల్చి చంపేశారని జిల్లా ఎస్పీ ఎస్ ఆనంద్ వెల్లడించారు.