తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమ జంటపై దుండగుడి కాల్పులు.. ఇద్దరూ మృతి.. పరువు హత్యేనా?

ఓ ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే?..

loving couple died of bullet injuries in suspicious manner-in-meerut-uttar-pradesh
loving couple died of bullet injuries in suspicious manner-in-meerut-uttar-pradesh

By

Published : Feb 20, 2023, 8:04 AM IST

ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతీయువకులిద్దరూ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పిస్టల్​ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం..
జానీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పెప్లా గ్రామానికి చెందిన సాక్షి(19) అనే యువతి, దేవేంద్ర అనే యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకున్నట్లు సమాచారం. అయితే ఆదివారం సాక్షి ఇంటికి తన ప్రియుడు దేవేంద్ర వెళ్లాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వారిద్దరిపై కాల్పులు జరిపాడు. సాక్షి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి బుల్లెట్​ గాయాలతో ఇద్దరూ అనుమానాస్పద రీతిలో కనిపించారు. దేవేంద్ర మృతదేహానికి సమీపంలోనే ఛాతిపై బుల్లెట్​ గాయంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది.

దీంతో కుటుంబసభ్యులు యువతిని వెంటనే సుభార్తి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే హాస్పిటల్​లో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరువు హత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలం నుంచి పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యువతి తండ్రి నగేష్​, తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు యువకుడి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే నిందితుడి ఆచూకీను కనిపెట్టేందుకు జీఎస్​ఆర్ టెస్టులు కూడా చేయించబోతున్నట్లు పోలీసులు తెలిపారు. పిస్టల్​తో యువతిని, యువకుడిని ఎవరు కాల్చారు? ఎలా కాల్చారు? అన్న విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నామని ఎస్​ఎస్పీ వివరించారు. అయితే బాధితులిద్దరి మొబైల్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొబైల్​లో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయని, వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details