lover murder in betul: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు మహిళను కత్తితో 16 పోట్లు పొడిచి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ హత్య జరిగేటప్పుడు మృతురాలి కుమారుడు అక్కడే ఉన్నాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3గంటలకు బైతూల్‌లోని సరణీ ప్రాంతంలో జరిగింది. రుబీనా, సందీప్ సాహుల మధ్య గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. తన కుమారుడు పెద్దవాడయ్యాడని ఇక నుంచి ఆ సంబంధాన్ని ఆపేద్దామని రుబీనా.. సందీప్‌ను కోరింది. దీంతో కోపానికి గురైన సందీప్.. రుబీనా మెడ, వివిధ శరీర భాగాలపై విచక్షణారహితంగా కత్తితో 16 పోట్లు పొడిచాడు. వెంటనే రుబీనాను ఘోరడోంగ్రీ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు సందీప్ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివాహేతర సంబంధం వద్దన్నందుకు.. 16సార్లు కత్తితో పొడిచి.. - బైతూల్‌లో ప్రియురాలిని కత్తితో పొడిచిన కిరాతకుడు
lover murder in betul: వివాహేతర సంబంధం వద్దన్నందుకు ప్రియురాలిని హత్య చేశాడు ఓ వ్యక్తి. విచక్షణా రహితంగా 16 సార్లు శరీరంపై పొడిచాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ప్రియురాలిని హత్యచేసిన ప్రేమికుడు
రుబీనాను గత రెండేళ్లుగా సందీప్ సాహు వేధిస్తున్నాడని మృతురాలి భర్త ఆసిఫ్ అలీ పోలీసులకు తెలిపాడు. ఆరు నెలల క్రితం కూడా సందీప్.. రుబీనా తల పగలగొట్టాడని అన్నాడు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. అందుకే అప్పట్లో తామే ఆ ప్రాంతాన్ని వదిలి వేరే చోటికి వెళ్లిపోయామని చెప్పాడు.
ఇదీ చదవండి:పెంపుడు కుక్కకు సీమంతం.. బంధుమిత్రులతో కలిసి ఘనంగా..