తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేయసితో అలా కనిపించాడని యువకుడిపై దాడి... ఉమ్మి నాకించి శిక్ష - ప్రియురాలిని బైక్​పై దింపినందుకు యువకుడిపై దారుణం

బిహార్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్​పై వెళ్లడాన్ని చూసిన యువతి గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం పంచాయితీ పెట్టారు. నేలపై ఉమ్మి వేయించి అతడితోనే నాకించారు.

lover licked his spit
నేలపై ఉమ్మును నాకుతున్న యువకుడు

By

Published : Oct 25, 2022, 7:34 AM IST

యువకుడితో ఉమ్మిను నాకించిన గ్రామస్థులు

బిహార్ సమస్తిపుర్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ప్రియురాలి గ్రామానికి వెళ్లిన ఓ యువకుడిని పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. యువకుడితో నేలపై ఉమ్మి వేయించి అతడితోనే నాకించారు. గ్రామంలోకి ఇంకెప్పుడూ రాకూదని బెదిరించి విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ వీడియో పోలీసులకు దృష్టికి చేరగా.. పలువురు గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది..ఉజియార్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మెహసారి గ్రామానికి చెందిన యువకుడు.. చఖబీబ్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని దింపేందుకు బైక్​పై ఆమె గ్రామానికి వెళ్లాడు. వీరిద్దరినీ చూసిన గ్రామస్థులు.. యువకుడిని పట్టుకుని అతడిపై దాడి చేశారు. అనంతరం పంచాయితీ పెట్టి.. యువకుడితో లాలాజలాన్ని నేలపై వేయించి అతడితోనే నాకించారు. ఇంకెప్పుడూ గ్రామంలోకి రావద్దని బెదిరించి విడిచిపెట్టారు. యువకుడిపై గ్రామస్థులు పాల్పడుతున్న దుశ్చర్యను ఓ వ్యక్తి వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details