తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.70 వేలు ఇచ్చి ప్రియురాలి హత్య.. మానసిక దివ్యాంగురాలిపై గ్యాంగ్​రేప్​ - ఉత్తర్​ప్రదేశ్ క్రైమ్ న్యూస్

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందని ప్రియురాలిని రూ.70 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, దివ్యాంగురాలిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఝార్ఖండ్​లో వెలుగుచూసింది.

lover killed girlfriend
హత్య

By

Published : Dec 5, 2022, 10:16 PM IST

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో దారుణం జరిగింది. ప్రియురాలిని రూ.70 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఆమె ప్రియుడు. మృతురాలిని సుశీలగా గుర్తించారు పోలీసులు. నిందితులు ప్రేమ్, రాజేశ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సుశీల, ప్రేమ్​ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ప్రేమ్​ను సుశీల ఒత్తిడి చేసింది. నిందితుడు ప్రేమ్​కు అంతకుముందే పెళ్లైంది. అందువల్ల సుశీలను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ప్రేమ్ తన స్నేహితుడి సుపారీ ఇచ్చి సుశీలను హత్య చేయించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో డిసెంబరు 1న స్కూటీ మీద సుశీలను బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ప్రేమ్​ స్నేహితులు అక్కడ ఉన్నారు. వారు సుశీల కడుపుపై కాల్పులు జరపడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మానసిక దివ్యాంగురాలిపై గ్యాంగ్​రేప్​..
ఝార్ఖండ్ పలాములో దారుణం జరిగింది. మానసిక దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. నిందితులను ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితురాలి తండ్రి, సోదరుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దివ్యాంగ బాలిక.. పశువులను మేపునకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. ఆమెను చెరుకు పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు పెట్టడం వల్ల బాధితురాలి మేనకోడలు వచ్చింది. అప్పుడు ఆమెను చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. నిందితుల ఇంటికి వెళ్లిన బాధితురాలి సోదరుడు, తండ్రిపై దాడికి పాల్పడ్డారు.

వెబ్​సిరీస్​లో అవకాశం ఇస్తామని..
ఓ యువతికి వెబ్​సిరీస్​లో నటించే అవకాశం ఇస్తామని చెప్పి బలవంతంగా పోర్న్ ఫిల్మ్​లో నటించేటట్లు చేశారు నలుగురు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చార్కోప్ పోలీసులు.. నలుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

మహిళా ఉద్యోగులపై..
ఉత్తరాఖండ్​ లక్సర్​లో దారుణం జరిగింది. బస్సులో వెళ్తున్న పతంజలి వెల్​నెస్​ సెంటర్​ మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. బస్సులో ఆరుగురు మహిళా ఉద్యోగులతో పాటు మరో ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. బస్సులోకి బలవంతంగా ఇద్దరు యువకులు ఎక్కారు. వీరు మహిళలను వేధించడం ప్రారంభించారు. వీరిని అదుపు చేసేందుకు మిగతా ఉద్యోగులు ప్రయత్నించేసరికి నిందితులు వారి స్నేహితులను పిలిచారు. వెంటనే వారు వచ్చి ఉద్యోగులందరినీ తీవ్రంగా కొట్టారు. దాడి అనంతరం నిందితులంతా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దీపక్, వరుణ్ అనే ఇద్దరు యువకులు సహా గుర్తు తెలియని మరో 8 మందిపై లక్సర్​ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details