తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేయసిని కాల్చి చంపిన ఉన్మాది.. పారిపోతుండగా ట్రక్కు ఢీకొని మృతి - ప్రియురాలిని గన్​తో కాల్చిన ప్రియుడి

ప్రేయసిపై తుపాకీతో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు ఓ ఉన్మాది. అయితే దారుణానికి పాల్పడి పారిపోతున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టి నిందితుడు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

lover dies firing
ప్రేయసిని చంపిన ప్రియుడు

By

Published : Sep 29, 2022, 5:58 PM IST

ప్రేయసిని కాల్చి చంపిన ఉన్మాది.. వెంటనే ట్రక్కు ఢీకొని మృతి

మహారాష్ట్ర పాల్ఘర్​లో దారుణం జరిగింది. బోయిసర్​ రోడ్డులోని టిమా ఆస్పత్రి వద్ద 21 ఏళ్ల యువతి తలపై ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే నిందితుడు హత్యానంతరం పారిపోతుండగా ఎదురుగా వచ్చిన ఓ ట్రక్కు అతడ్ని ఢీకొట్టింది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కృష్ణ యాదవ్​.. నేహా అనే యువతిని హత్య చేసేందుకు ప్రేమ వ్యవహారంలో గొడవ రావడమే కారణం. కృష్ణ యాదవ్ స్వస్థలం కోల్వాడే. అతడి ప్రియురాలు నేహా.. సరావళికి చెందిన యువతి. బోయిసర్‌లోని టిమా హాస్పిటల్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ కింద బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నేహా తలపై.. నిందితుడు కృష్ణ తుపాకీతో కాల్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

బాధితురాలిపై కాల్పులు జరిపి నిందితుడు కృష్ణ పారిపోతుండగా అతడ్ని ఓ కారు ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓ ఆర్మీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు కృష్ణను టిమా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నిందితుడి వద్ద ఉన్న తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ

పాఠశాల విద్యార్థుల పడవ బోల్తా.. అనేక మంది గల్లంతు

ABOUT THE AUTHOR

...view details